వర్మకు షాక్: ARKB సినిమాపై నోటీసులు జారీ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ARKB సినిమాపై KA పాల్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన పోలీసులు…రేపు CCS పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. తన ఫోటోలు,వీడియోలు మార్ఫింగ్ చేశారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు KA పాల్.

అంతకుముందు…తన ARKB సినిమా విడుదలను ఆలస్యం చేసిన వారిపై కోర్టుకెళ్తానన్నారు రాంగోపాల్ వర్మ. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను కొంత మంది అడ్డుకునేందుకు యత్నించారని చెప్పారు. సినిమా విడుదలైతే గొడవలు అవుతాయన్న వారు ఇప్పుడు ఎక్కడున్నారని వర్మ ప్రశ్నించారు. కేవలం ఈ సినిమా సెటైరికల్, కామెడీగానే తీసినట్టు చెప్పారు. ఇక ముందు ఇలాంటి సినిమాలే తీస్తానన్నారు వర్మ. 16 భాషల్లో ఎంటర్ ది డ్రాగన్ సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

Latest Updates