అఖిలప్రియ బెయిల్ విషయంలో పోలీసులకు నోటీసులు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిల ప్రియ బెయిల్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై  సెషన్స్ కోర్టులో విచారణ సందర్భంగా.. బెయిల్ మంజూరు చేయాలని  అఖిల ప్రియ తరపు న్యాయవాదులు కోరారు. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ పై పోలీసులకు నోటీసులు జారీ చేసింది సెషన్స్ కోర్టు..తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన సెషన్స్ కోర్టు.

మరో వైపు బోయినపల్లి కిడ్నాప్ కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్స్ మల్లికార్జున్ రెడ్డి, సంపత్ లను మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు బోయినపల్లి పోలీసులు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు నిందితులకు వైద్య పరీక్షలు చేసి బోయిన్ పల్లి పిఎస్ కు తరలించారు.

see more news

LRS పై విచారణ.. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఎట్టకేలకు కనిపించిన జాక్ మా.. ఇన్నాళ్లు ఎక్కడ?

మిషన్ భగీరథను చూసి మనసు మార్చుకుని టీఆర్ఎస్ లో చేరా

Latest Updates