ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ పోతుల సునీత  రాజీనామా తో ఖాళీ ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయి అటు తర్వాత పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైంది. ఆ స్థానానికి కూడా రాజీనామా చేయడంతో భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 11న నామినేషన్ దాఖలు ప్రారంభం, ఈనెల 18న చివరి తేదీ, జనవరి 19న నామినేషన్ పరిశీలన, జనవరి 21న నామినేషన విత్ డ్రా, జనవరి 28న ఎన్నికల పోలింగ్.. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.

Latest Updates