అగ్రి వర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్ కు నోటిఫికేషన్

రాజేంద్రన‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌లోని ప్రొఫెస‌‌‌‌ర్ జ‌‌‌‌య‌‌‌‌శంక‌‌‌‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌‌‌‌ల్చర‌‌‌‌ల్ యూనివ‌‌‌‌ర్సిటీ(పీజేటీఎస్‌‌‌‌ఏయూ) వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల్లో(కేవీకే) నాన్​ టీచింగ్​ పోస్టుల భ‌‌‌‌ర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: 40

ప్రోగ్రాం అసిస్టెంట్

(ఫార్మ్ మేనేజ‌‌‌‌ర్‌‌‌‌, ల్యాబ్ టెక్నీషియ‌‌‌‌న్‌‌‌‌): 16

అర్హత‌‌‌‌: గుర్తింపు పొందిన యూనివ‌‌‌‌ర్సిటీ నుంచి అగ్రిక‌‌‌‌ల్చర్‌‌‌‌/ హార్టిక‌‌‌‌ల్చర్‌‌‌‌/ సీఏ అండ్ బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ప్రోగ్రాం అసిస్టెంట్

(కంప్యూట‌‌‌‌ర్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌): 16

అర్హత‌‌‌‌: గుర్తింపు పొందిన యూనివ‌‌‌‌ర్సిటీ నుంచి అగ్రిక‌‌‌‌ల్చర్‌‌‌‌/ హార్టిక‌‌‌‌ల్చర్‌‌‌‌/ సీఏ అండ్ బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ/  బీఎస్సీ(కంప్యూట‌‌‌‌ర్ సైన్స్‌‌‌‌) పూర్తి చేసిన వారు అర్హులు.

అసిస్టెంట్ పోస్టుల‌‌‌‌కు ఏదైనా బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు కంప్యూట‌‌‌‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌‌‌‌–3: 8

అర్హత‌‌‌‌: బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌‌‌. షార్ట్‌‌‌‌హ్యాండ్ ఇంగ్లిష్ లోయ‌‌‌‌ర్ గ్రేడ్‌‌‌‌, టైప్ రైటింగ్ ఇంగ్లిష్ లోయ‌‌‌‌ర్ గ్రేడ్ టైపింగ్ స్కిల్స్​ వచ్చి ఉండాలి.

డ్రైవ‌‌‌‌ర్స్‌‌‌‌: 16

అర్హత‌‌‌‌: ప‌‌‌‌దోత‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి/ త‌‌‌‌త్సమాన ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌‌‌‌లో అనుభ‌‌‌‌వం ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత ప‌‌‌‌రీక్ష, టైపింగ్ టెస్ట్‌‌‌‌, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది.

కేట‌‌‌‌గిరీ–1: ఈ పోస్టుల‌‌‌‌కు ఉమ్మడి రాత ప‌‌‌‌రీక్ష ఉంటుంది. దీన్ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కుల‌‌‌‌కు దీన్ని నిర్వహిస్తారు. ప‌‌‌‌రీక్షా స‌‌‌‌మ‌‌‌‌యం మూడు గంట‌‌‌‌లు. ప్రతి త‌‌‌‌ప్పు స‌‌‌‌మాధానానికి 1/ 4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్​ చేస్తారు.

కేట‌‌‌‌గిరి–2: ఈ పోస్టుల‌‌‌‌కు పార్ట్‌‌‌‌–ఏ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ రాత ప‌‌‌‌రీక్ష, పార్ట్‌‌‌‌–బి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. రాత ప‌‌‌‌రీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ నాలెడ్జ్‌‌‌‌, క‌‌‌‌రెంట్ ఎఫైర్స్‌‌‌‌, జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. ప‌‌‌‌రీక్షా స‌‌‌‌మ‌‌‌‌యం రెండున్నర గంట‌‌‌‌లు. పార్ట్–బిలో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 15 నిమిషాల స‌‌‌‌మ‌‌‌‌యం, 30 మార్కులు కేటాయిస్తారు.

కేట‌‌‌‌గిరీ–3: ఈ పోస్టుల‌‌‌‌కు పార్ట్‌‌‌‌–ఏ డిక్టేష‌‌‌‌న్‌‌‌‌ ప‌‌‌‌రీక్ష, పార్ట్‌‌‌‌–బి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. డిక్టేష‌‌‌‌న్ ప‌‌‌‌రీక్ష ఇంగ్లిష్‌‌‌‌లో ఉంటుంది. ప‌‌‌‌ది నిమిషాల స‌‌‌‌మ‌‌‌‌యంలో నిమిషానికి 80 ప‌‌‌‌దాల చొప్పున టైప్ చేసి దాన్ని 45 నిమిషాల్లో ట్రాన్స్‌‌‌‌క్రైబ్ చేయాలి. ఎగ్జామ్​ 70 మార్కుల‌‌‌‌కు ఉంటుంది.  పార్ట్‌‌‌‌–బి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 30 నిమిషాల స‌‌‌‌మ‌‌‌‌యం, 30 మార్కులు కేటాయిస్తారు.

కేట‌‌‌‌గిరీ–4: ఈ పోస్టుల‌‌‌‌కు త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తులు, డ్రైవింగ్ అనుభ‌‌‌‌వం, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జ‌‌‌‌రుగుతోంది. దీన్ని మొత్తం 100 మార్కుల‌‌‌‌కు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌‌‌‌–ఏ 15 మార్కుల‌‌‌‌కు, పార్ట్‌‌‌‌–బి 5 మార్కులు, పార్ట్‌‌‌‌–సి 80కి మార్కులు ఉంటాయి. పార్ట్–ఏ, బీ, సీ ప‌‌‌‌రీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్​ ప్రాసెస్​:

ఆన్‌‌‌‌లైన్ ద్వారా ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు  ప్రారంభం:     7 జనవరి 2021.

చివ‌‌‌‌రి తేది:             19 జనవరి 2021

ఎగ్జామ్​:                  24 జనవరి 2021

(కేట‌‌‌‌గిరి–1, కేటగిరీ–2)

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్


Latest Updates