2557 ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులు

తెలుగు​ రాష్ట్రాల్లో భారీగా పెరిగిన పోస్టులు

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్(ఐబీపీఎస్​) క్లర్క్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ మొదలయ్యాయి. ఫస్ట్​ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 1557 క్లర్క్​ జాబ్స్​ మాత్రమే ఉండగా.. రీసెంట్​గా రిలీజ్​ చేసిన రీ నోటిఫికేషన్​లో మరో1000 పోస్టులు పెరిగాయి. అన్నీ కలిపి 2557 ఖాళీలు ఉండగా.. తెలంగాణలో– 62,  ఏపీలో 85 పోస్టులు ఉన్నాయి. లక్షల సంఖ్యలో పోటీపడే క్లర్క్​ జాబ్​ కొట్టడం ఎలా.. ప్రిపరేషన్ ఈజీ అవడానికి ఏం చదవాలిఏయే సబ్జెక్ట్​లపై ఫోకస్​ పెట్టాలి.. తదితర అంశాలపై ప్రిపరేషన్​ ప్లాన్​ ఈ వారం.

లక్షల సంఖ్యలో పోటీపడే బ్యాంక్​ క్లర్క్​ కొలువు కొట్టడం ఎలా.. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి.., ఏయే సబ్జెక్టులపై ఫోకస్​ పెట్టాలిపూర్తి వివరాలతో ప్రిపరేషన్​ ప్లాన్.

బ్యాంకు పరీక్షల సిలబస్​ మిగతా గవర్నమెంట్​ ఎగ్జామ్స్​ సిలబస్​తో పోలిస్తే చాలా తక్కువ. ప్రతి సంవత్సరం 6 నుంచి 8 క్లర్క్​, పీవో పోస్టులకు నోటిఫికేషన్స్​ వస్తుంటాయి. అన్ని బ్యాంకు పరీక్షల సిలబస్​ దాదాపు ఒకటే. ప్రిలిమ్స్​లో అభ్యర్థి వేగం, కచ్చితత్వంపై, మెయిన్స్​లో విషయావగాహనపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సిలబస్​లో ఇచ్చిన  అంశాలను బేసిక్​ స్థాయి మొదలు డెప్త్​ వరకు ప్రాక్టీస్​ చేయగలిగితే జాబ్​ కొట్టడం ఈజీ. ఐబీపీఎస్  సెలెక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్​, మెయిన్స్​ రెండు స్టేజిలలో ఉంటుంది.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​ను స్పీడ్​ మ్యాథ్స్,  అర్థిమెటిక్​, డేటా ఇంటర్​ప్రిటేషన్​ ఇలా మూడు భాగాలుగా ప్రిపేరవ్వాలి. స్పీడ్​ మ్యాథ్స్​లో సింప్లిఫికేషన్స్​, అప్రాక్సిమేషన్​, నెంబర్​ సిరీస్​, క్వాడ్రటిక్​ ఈక్వేషన్స్​ ఉంటాయి. వీటి కోసం వేదిక్​ మ్యాథ్స్​ను ఉపయోగించి ఎక్కాలు 20 వరకు, వర్గాలు 30 వరకు, ఘనాలు 20 వరకు, కూడిక, గుణకారం, వర్గమూలం, ఘనమూలాలు నేర్చుకుంటే ఎగ్జామ్​ ఈజీ అవుతుంది.

అర్థిమెటిక్​లో పర్సంటేజ్​, రేషియో ప్రపోర్షన్​, ప్రాఫిట్–​లాస్​, ఏజస్​, పార్ట్​నర్​షిప్​, ఎస్​ఐ అండ్​ సీఐ, పైప్స్​​అండ్​ సిస్టర్న్స్​,  టైమ్​ స్పీడ్​ డిస్టెన్స్​, బోట్స్​ అండ్​ స్ప్రీమ్స్​, యావరేజస్​, పర్మిటేషన్​ అండ్​ కాంబినేషన్స్​, ప్రాబబులిటీ, మెన్స్యూరేషన్​ తదితర చాప్టర్లపై ఫోకస్​ పెట్టాలి.

డేటా ఇంటర్​ప్రిటేషన్​లో  రెండు రకాల సమస్యలు ఉంటాయి. పర్సంటేజీలు, రేషియో, యావరేజీలను ఉపయోగించి సాధించే సమస్యలు, ఎస్సై అండ్​ సీఐ, టైం అండ్​ వర్క్​,  స్పీడ్​ అండ్​ డిస్టెన్స్,​ ప్రాబబులిటిలను ఉపయోగించి సాధించే సమస్యలు ఉంటాయి.  వీటిని ఎంత ఎక్కువ ప్రాక్టీస్​ చేస్తే ఎగ్జామ్​ అంత ఈజీ అవుతుంది.

రీజనింగ్​ ఎబిలిటీ

ప్రీవియస్ పేపర్లను గమనిస్తే  రీజనింగ్ఎబిలిటీలో ఎక్కువగా సిట్టింగ్​ అరేంజ్​మెంట్​, పజిల్​ టెస్ట్ ల నుంచే 15  నుంచి 20 వరకు  ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితో పాటు డైరెక్షన్స్​, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, కోడెడ్​ ఇనీక్వాలిటీ,​ ఆల్ఫాబేట్​ టెస్ట్, కోడింగ్​ అండ్​ డికోడింగ్​, ఆల్ఫా న్యూమరిక్  సిరీస్, సిలాగిజం, డేటా సఫిషియేన్సి, ఇన్​పుట్​–అవుట్​పుట్​, స్టేట్​మెంట్స్​ అండ్​ అస్యంప్సన్స్​ ​వంటి వాటిపై దృష్టి పెట్టాలి.  బ్యాంకు ప్రీవియస్​ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా ప్రాక్టీస్​ చేయాలి. ప్రతి మాక్​ టెస్ట్​ 18 నుంచి 20 నిమిషాలలో పూర్తి చేయగలిగితే స్పీడ్​ పెరిగినట్లు లెక్క.

ఇంగ్లిష్​ లాంగ్వేజ్​

బ్యాంక్ ఎగ్జామ్​లో  ఇంగ్లిష్ సబ్జెక్ట్  కీలకం. అందుకే వొకాబులరీ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇంగ్లిష్​ లో వొకాబులరీతోనే సగానిపైగా మార్కులు స్కోర్​ చేయొచ్చు. రోజుకు 5 కొత్త పదాల చొప్పున నేర్చుకుంటూ గ్రామర్ అంశాలపై ఫోకస్ పెడితే మేలు.
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్లోజ్​ టెస్ట్​, రీడింగ్​ కాంప్రహెన్షన్​, స్పాటింగ్​ ఎర్రర్స్​, వర్డ్​ స్వాపింగ్, పారాజంబుల్​, మ్యాచ్​ ది కాలమ్​, ఇడియమ్స్​ అండ్​ ప్రేజస్​ వంటి టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

జనరల్​ / ఫైనాన్సియల్​ అవేర్​నెస్

జనరల్​/ ఫైనాన్షియల్​ అవేర్​నెస్​ ను స్టాటిక్​ జీకే, ఫైనాన్షియల్​ అవేర్​నెస్​, కరెంట్ ఎఫైర్స్​ అని మూడు కేటగిరీలుగా డివైడ్​ చేయొచ్చు.

స్టాటిక్​ జీకే: స్టాటిక్​ జీకేలో కంట్రి, కరెన్సీ అండ్​ క్యాపిటల్​,  ప్రపంచంలో, దేశంలో మొట్టమొదటివి, భారత రాజ్యాంగం, భారతీయ సంస్కృతి, విమానాశ్రయాలు, రైల్వేలు, చరిత్ర, జాగ్రఫి అంశాలపై ఫోకస్​ పెట్టాలి.

ఫైనాన్షియల్​ అవేర్​నెస్​: ఇందులో ఇండియన్​ బ్యాంకింగ్​, ఇంపార్టెంట్​ డేట్స్​, బ్యాంక్​ హెడ్​క్వార్టర్​, రెగ్యులేటరీ బాడీస్​, ఆర్బీఐ విధులు, ఇంటర్​నేషనల్​ ఆర్గనైజేషన్స్​ మొదలైనవి చూసుకోవాలి.

కరెంట్​ ఎఫైర్స్​: ప్రభుత్వ స్కీమ్స్​, ఇంటర్​నేషనల్, నేషనల్​ డేట్స్​, అవార్డులు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, అవార్డులు, సదస్సులు వంటి సమాచారాన్ని ఎగ్జామ్​కు ఆరు నెలల ముందువి స్టడీ చేయాలి.

కంప్యూటర్​ నాలెడ్జ్​

అభ్యర్థికి కంప్యూటర్స్​ పై ఉన్న బేసిక్​ నాలెడ్జ్​ను టెస్ట్​ చేసేలా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి కంప్యూటర్ల పరిచయం, ఎంఎస్​ ఆఫీస్​, కంప్యూటర్​ హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​, ఇంటర్​నెట్​ అండ్​ నెట్​వర్కింగ్​, కీబోర్డ్​ షార్ట్​కట్స్​, అబ్రివేషన్స్​ చూసుకోవాలి.

ఎగ్జామ్ ప్యాటర్న్

ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్​ ఎగ్జామ్​. ఇందులో మూడు విభాగాల్లో100 ప్రశ్నలకు 60  నిమిషాల టైమ్ ఉంటుంది. ప్రతి సెక్షన్ 20 నిమిషాలలో పూర్తి చేయాల్సిందే. కొత్తగా ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్  టైమ్ మేనేజ్​మెంట్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి.  న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే తక్కువ టైమ్​లో ఆన్సర్ చేయడం వీలవుతుంది.

మెయిన్స్: మెయిన్స్​లో మొత్తం నాలుగు సెక్షన్లలో 190 ప్రశ్నలను 160 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్​కు కేటాయించిన టైమ్  పూర్తయిన తర్వాతే  మరో సెక్షన్ ఓపెన్ అవుతుంది.

ప్రాక్టీస్​ ఇంపార్టెంట్​

బ్యాంక్​ క్లర్క్​ జాబ్​కు ప్రిపేరయ్యే వారు అక్యురసీ బాగా మెయింటెయిన్​ చేయాలి. వీలైనన్ని ఎక్కువ టెస్ట్​లు ప్రాక్టీస్​ చేస్తే మంచిది. మెయిన్స్​లో ఇంగ్లిష్​, జనరల్​ అవేర్​నెస్​పై ఫోకస్​ పెడితే ఎక్కువ మార్కులు స్కోర్​ చేయొచ్చు. దాదాపు ఇంగ్లీష్ సబ్జెక్టే డిసైడింగ్​ ఫ్యాక్టర్​. అందుకే మొదటి నుంచి దానిపై ప్ర్యతేక దృష్టి పెట్టాలి. రోజూ ఇంగ్లిష్​ న్యూస్​ పేపర్స్​ చదవడం అలవాటు చేసుకుంటే ఇంగ్లిష్​ పెరగడంతోపాటు కరెంట్​ ఎఫైర్స్​కు ఉపయోగపడుతుంది.–శ్రీనివాస్​ గాజుల, కెనరా బ్యాంక్​  క్లర్క్, వెదిర, కరీంనగర్.

 

 

Latest Updates