9న డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు మే- 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. విద్యార్థులు ఈ నెల 10వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దోస్తు వెబ్‌సైట్‌లో రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు, ఫలితాల వెల్లడి ప్రక్రియపై గురువారం ఉన్నత విద్యామండలి సమీక్ష సమావేశం నిర్వహించింది. సమీక్షకు 9 యూనివర్సిటీల సబ్ రిజిస్ట్రార్లు హాజరయ్యారు. పరీక్షలు, ఫలితాల నిర్వహణలో సంస్కరణలు అవసరమని సమావేశంలో నిర్ణయించారు. సంస్కరణలు సూచించేందుకు ముగ్గురు వీసీలతో కమిటీ ఏర్పాటు చేశారు. నెలరోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి ఉన్నత విద్యామండలి గడువు విధించింది.

Latest Updates