టెన్నిస్‌ ‌క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్ కు కరోనా పాజిటివ్‌

ప్రపంచ నంబర్‌ వన్ టెన్నిస్‌ ‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని జకోవిచ్‌ స్వయంగా వెల్లడించాడు. జకోవిచ్‌తో పాటు అతడి భార్య జెలీనాకు పాజిటివ్‌గా తేలింది. అయితే, వారి పిల్లలకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయంపై జోకోవిచ్‌ మాట్లాడుతూ..’ నేను బెల్‌గ్రేడ్‌కు చేరుకున్న తర్వాత నా భార్య పిల్లలతో కలిసి కోవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాను. రిపోర్టులో నాకు, నా భార్యకు పాజిటివ్‌ రాగా, పిల్లలకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. ఈ 14 రోజులు నా భార్యతో కలిసి హోం క్వారెంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటాం.’ అని తెలిపాడు.

Latest Updates