సైంటిస్ట్ ల రీసెర్చ్ : ముక్కు నుంచి బ్రెయిన్ లోకి వెళుతున్న కరోనా

సైంటిస్ట్ ల రీసెర్చ్ ప్రకారం కరోనా ముక్కు రంధ్రాల ద్వారా మెదడులోకి ప్రవేశిస్తోందని బెర్లిన్‌లోని చరిటే-యూనివర్సిటాట్స్‌ సైంటిస్ట్ ల బృందం తెలిపింది. నేచర్‌ న్యూరో సైన్స్‌ జర్నల్‌ కథనం ప్రకారం.., ముక్కురంద్రాల నుంచి శ్వాసకోశ గ్రంథుల ద్వారా వైరస్‌ మెదడుకు చేరుతుంది. దీంతో రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయనే అంశంపై సైంటిస్ట్ లు పరిశోధనలు చేయగా..ఆ పరిశోధనల్లో మెదడు, మెదడులో ఉండే  సెరెబ్రో స్పానియల్‌ అనే రసంతో పాటు  , నాడీ వ్యవస్థలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ ను సైంటిస్ట్ లు  గుర్తించారు. కాబట్టే వాసనను గ్రహించే గుణాన్ని కోల్పోతున్నట్లు  కథనంలో పేర్కొంది.  గొంతుతో నాసికా రంధ్రాలు అనుసంధానమయ్యే చోటు వైరస్‌ మొదటి స్థావరమని, అక్కడి నుంచి మెదడుకు చేరుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Latest Updates