40 ఏళ్ల క్రితమే చైనా కొత్త వైరస్ గురించి చెప్పిన…

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కొత్త వైరస్ కరోనా గురించి ఓ నవలా రచయిత 40 ఏళ్ల క్రితమే ఊహించాడు. 1981లో అమెరికా రచయిత డీన్ కూంట్స్ తన థ్రిల్లర్ నవల ‘ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్’లో వుహాన్ సిటీలో కొత్త వైరస్‌ ప్రస్తావన చేశారు. ఆయన తన ఫిక్షన్ స్టోరీలోని ఓ పేజీలో దీని గురించి రాశారు. వుహాన్ సిటీలోని మిలటరీ ల్యాబ్‌లో చైనా కావాలని బయో వెపన్‌ కోసం ఈ వైరస్‌ను సృష్టించినట్లు ఆ బుక్‌లో ఉంది. వుహాన్-400 అనే పేరుతో చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను క్రియేట్ చేసినట్లు ఆ ఫిక్షన్ స్టోరీలో రాశారు డీన్. శత్రు దేశాలపై పోరాటానికి చైనా జీవ ఆయుధాన్ని తయారు చేసిందని పేర్కొన్నారు. ఈ వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుందని, ఏ జంతువుకూ అంటుకోదని అందులో ఉంది. ఈ వైరస్‌తో ఓ సిటీనీ లేదా దేశాన్నే నాశనం చేయొచ్చని రాశారు రచయిత.

‘ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్’ బుక్‌లో కొత్త వైరస్ గురించి రాసి ఉన్న పేజీని డారెన్ ప్లేమౌత్ అనే నెటిజన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. 40 క్రితం ఆ పుస్తకంలో రాసిన దానికి దగ్గరగా ఇప్పుడు జరుగుతుండడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. దీనిపై ట్విట్టర్‌లో చాలా మంది స్పందిస్తున్నారు. కరోనా వైరస్ వుహాన్ సిటీలోనే పుట్టడం, ‘ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్’ నవలలో రాసిన వైరస్ కూడా వుహాన్ సిటీలోనే సృష్టించడం అనుకోకుండా కోయిన్సైడ్ అయ్యాయంటున్నారు. కొందరు మాత్రం ఆ బుక్‌లో చెప్పినట్లుగా కరోనా చైనా బయో వెపనే అని ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఇది చైనా కుట్రేనా అని అనుమానం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Latest Updates