పిల్లల చదువుకోసం వింత ప్రయోగం: స్కూలు‌కు వెళ్లేందుకు డ్రమ్ముల రైలు

ఆస్ట్రేలియాలోని పిల్బరా ప్రాంతం.చుట్టుపక్కల పల్లెలు ఎన్నో ఉన్నాయి.పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరంగా ఉంటూ వచ్చారు.  అయితే 2017లో ఈ ప్రాంతంలో అఆఇఈలు ఎక్కువ మందికి నేర్పాలని ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.  సౌకర్యాలు కల్పించినా మొదట్లో పిల్లలు స్కూల్‌‌‌‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు.  దీంతో పున్ము తెగకు చెందిన జాన్‌‌‌‌ రెదవెయ్‌‌‌‌ అనే వ్యక్తి ఒక ఆలోచన చేశాడు. ఇనుప డ్రమ్ములను కట్‌‌‌‌ చేయించి ఓపెన్‌‌‌‌ రైల్వే బోగీలను తయారు చేయించాడు.
వాటిని ఒక మినీట్రాక్టర్‌‌‌‌కి కనెక్ట్‌‌‌‌ చేసి లాక్కుంటూ వెళ్లాడు. పిల్లలకు అదొక టాయ్‌‌‌‌ ట్రెయిన్‌‌‌‌ లాగా అనిపించింది. సరదాగా ఎక్కి ఆడుకున్నారు.  వాళ్లను సరాసరి స్కూల్‌‌‌‌కి తీసుకెళ్లి దింపాడు జాన్‌‌‌‌.  రోజూ ఆ ట్రైన్‌‌‌‌లో తీసుకెళ్తానని చెప్పడంతో
పిల్లలు కన్విన్స్‌‌‌‌ అయ్యారు.  అలా ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఈ డ్రమ్‌‌‌‌ ట్రైన్‌‌‌‌లోనే పిల్లల రాకపోకలు సాగుతున్నాయి.

Latest Updates