ఏపీ అవతరణ దినోత్సవం : సీమ విద్యార్థి జేఏసీ బ్లాక్ డే

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ.. రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో బ్లాక్ డే పాటించారు. శుక్రవారం నగర నడిబొడ్డున ఉన్న రాజవిహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నల్ల రిబ్బన్లు ధరించి.. నల్ల జెండాలతో.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.

కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేశారు. నవంబర్ 1 వద్దు.. అక్టోబర్ 1నే ఆంధప్రదేశ్ అవతరణ దినోత్సవం ముద్దు అంటూ నినాదాలు చేశారు. నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నాం.. జై రాయలసీమ అంటూ జై కొట్టారు.

 

 

Latest Updates