22న బంగ్లాతో డే నైట్ టెస్ట్ మ్యాచ్: బీసీసీఐ

బీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ క్రికెట్ లో మార్పులకు శ్రీకారం చుట్టాడు. అందులో ఒకటి డై అండ్ నైట్ టెస్టు మ్యాచ్. తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్  నవంబర్ 22న ఈడెన్ గార్డెన్ లో జరగనుందని బీసీసీఐ తెలిపింది. నవంబర్ 3 నుండి బంగ్లాదేశ్ భారత్ తో మూడు టీ20 లు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. 14న మొదటి టెస్టు మ్యాచ్ జరగగా..22 నుండి జరిగే రెండవ టెస్టు డే అండ్ నైట్ జరగనుంది. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరపాలన్న తన విన్నపాన్ని ఒకే చెప్పినందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు, భారత కెప్టెన్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు గంగూలీ.

Latest Updates