ఫార్వర్డ్ పోస్టుల్లో పంజాబీ పాటలు.. డ్రాగన్ కొత్త ఎత్తుగడ!

లేహ్: ఇండియా-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రికత్త వాతావరణం కొనసాగుతోంది. మిలటరీ, దౌత్యపరమైన చర్చలు జరిగినా బార్డర్‌‌లో పెద్దగా మార్పు లేదు. భారత దళాలు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఎత్తు ప్రాంతాలపై బలం పెంచుకున్నాయి. అక్కడి నుంచి పీఎల్‌‌ఏ దళాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో తాజాగా చైనా తన ఫార్వర్డ్ పోస్టుల వద్ద పంజాబీ పాటలను లౌడ్‌‌స్పీకర్లలో ప్లే చేయడం గమనార్హం. ఫింగర్ 4 ఏరియాలో తమను గమనిస్తున్న ఇండియన్ సైనికుల దృష్టిని ఏమార్చడం కోసమే చైనా పంజాబీ సాంగ్స్‌‌ను ప్లే చేస్తోందని సమాచారం. ఈ నెల 8న ఇదే ప్రాంతంలో ఇండో-చైనా దళాలు దాదాపు 100 రౌండ్లకు పైగా కాల్పులు చేసిన విషయం తెలిసిందే. బార్డర్ వివాదం నేపథ్యంలో గత ఇరవై రోజుల్లో ఈస్టర్న్ లడఖ్‌‌లో ఇండో-చైనాలు కనీసం మూడుసార్లు ఫైరింగ్‌‌కు దిగాయి. పాంగాంగ్ లేక్ వద్ద జరిగిన తొలి ఘటనలో చైనా అతిక్రమణను భారత్ దీటుగా తిప్పికొట్టింది. ఈ నెల 7న ముఖ్‌‌పరి వద్ద రెండో సారి ఇరు దళాలు ఎదురుపడ్డాయి. 8వ తేదీన జరిగిన మూడో ఘటనలో చైనా దుందుడుకుగా వ్యవహరించడంతో ఇండియన్ ఆర్మీ కాల్పులకు దిగింది. ఇరు దళాలు వంద రౌండ్ల ఫైరింగ్ చేశాయి.

Latest Updates