ఇప్పుడు మేమేం ఆర్డర్స్ ఇవ్వం: సుప్రీం

తనపై ఈసీ ఆంక్షలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీఎస్పీ చీఫ్‌ మాయావతికి చుక్కెదురైంది. ఎన్నికల సంఘం కళ్లు తెరిచిందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. కోడ్‌ ఉల్లంఘించిన నేతలపై ఈసీ ఇప్పటికైనా చర్యలు తీసుకుం దంటూ సంతృప్తి వ్యక్తం చేసింది. మతం పేరు ప్రస్తావిస్తూ ఓట్లడిగినందుకు మాయావతి ప్రచారంపై రెండ్రోజులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంపై మూడ్రోజులపాటు ఈసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు కేంద్రమంత్రి మేనకాగాంధీ, ఎస్పీ నేత ఆజంఖాన్‌ పైనాఆంక్షలు విధించింది. తనపై ఆంక్షలు విధించడాన్ని సవాల్‌ చేస్తూ మాయావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె పిటిషన్‌ ను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ , జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన బెంచ్‌ మంగళవారం తోసిపుచ్చింది.‘కావాలనుకుం టే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ లేదంటే అప్పీల్‌ చేసుకోం డి. మేం మాత్రం ఇప్పుడు దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోం’ అని పేర్కొం ది.

 

Latest Updates