ముగిసిన కస్టడీ : చంచల్ గూడ జైలుకు నౌహీరా షేక్

 హైదరాబాద్ : హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ కు పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో నౌహీరా షేక్ ను ప్రవేశపెట్టారు సైబరాబాద్ ఎకనామిక్ అఫైన్స్ వింగ్ అధికారులు. ఆ తర్వాత… నౌహీరా షేక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.

హీరా గోల్డ్‌ కేసులో ఫిబ్రవరి 2న నౌహీరా షేక్ కు ఐదురోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అప్పగించింది. చిత్తూరు జైలులో ఉన్న నౌహీరాను.. సైబరాబాద్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై జనవరి నెలాఖరున… హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చి చంచల్‌గూడ మహిళా జైలుకు పంపించారు. కేసులో మరింత విచారణ చేయాల్సి ఉండటంతో… నౌహీరాను తమ కస్టడీకి అప్పగించాలని సైబరాబాద్‌ ఎకనామిక్‌ వింగ్‌ అధికారులు రంగారెడ్డి జిల్లాకోర్టులో పిటిషన్ వేశారు. విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు నౌహీరా ఐదురోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. పోలీసులు గత శనివారం నౌహీరా షేక్‌ను జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ తర్వాత ఇవాళ మళ్లీ చంచల్ గూడ మహిళా జైలుకు పంపించారు.

Latest Updates