NRI భర్తల అరాచకాలకు చెక్ : ఆస్తులు సీజ్, పాస్ పోర్టులు రద్దు

nriకేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకురాబోతున్నది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న NRI భర్తల అరాచకాలకు శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారం పేరుతో కోట్లకు కోట్లు కట్నాలు తీసుకుని.. ఆ తర్వాత ఇండియాలోనే భార్యను వదిలేయటం లేదా విదేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లి మోసపోయి ఇండియా వస్తున్న బాధితులకు న్యాయం జరగటం లేదు. నిందితుడు విదేశాల్లోనే ఉండటంతో దేశానికి రప్పించటం కష్టంగా మారుతుంది. NRI భర్తల అరాచకాలకు చెక్ పెడుతూ కొత్త చట్టం రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు సంబంధించిన విధివిధానాలు కూడా రెడీ అయ్యాయి.

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, మేనకాగాంధీ ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించిన విధివిధానాలు ఇలా ఉన్నాయి. NRI భర్తలకు సంబంధించి భారతదేశంలోని వారి ఆస్తులను మొటద సీజ్ చేశారు. అందులో భార్యకి న్యాయం రావాల్సిన వాటాను ఆమెకు అప్పగిస్తారు. దీని కోసం చట్ట సవరణ కూడా చేయాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు.. పాస్ పోర్టు కూడా రద్దు చేస్తారు. ప్రస్తుతం ఆ నిందితుడు ఏ దేశంలో అయితే ఉన్నాడో.. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లకుండా విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు జారీ చేస్తారు. పరారీలో ఉన్న వ్యక్తి.. అతడు నిందితుడు అంటూ ఆయా దేశాలకు సమాచారం ఇస్తారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్చటంతోపాటు.. మరికొన్నింటికి సవరణ చేయటం ద్వారా ఇది సాధ్యమే అంటున్నారు. అదే విధంగా NRI వివాహాలను 48 గంటల్లోనే రిజిస్టర్ చేయాలనే నిబంధనను కచ్చితంగా అమలు అయ్యి తీరాలని కండీషన్ పెడుతోంది. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates