కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీ విరాళం

చిత్తూరు : కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు బుధవారం రూ. లక్ష అమెరికన్ డాలర్లను విరాళం ఇచ్చారు. ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే రూ. 72,88,877/- (72 లక్షల, 88 వేల, 877 వందల) రూపాయలతో సమానమని అధికారులు పేర్కొన్నారు.

ఈ విరాళాన్ని భక్తుని కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్ కు 50 వేల డాలర్లు, గోసంరక్షణ ట్రస్టుకు 50 వేల డాలర్లను ఆలయం ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ..  ప్రవాస భారతీయుడైన ఓ భక్తుడు.. తన బిజినెస్ లో వృద్ధి సాధించడంతో ఈ విరాళ రూపంలో వినాయక స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నట్లు తెలిపారు. స్వామివారికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం కాణిపాక ఆలయ చరిత్రలో ఇదే ప్రథమమని ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడిని మీడియా తరఫున అభినందించారు.

Latest Updates