శ్రీవారికి ఎన్నారై కోటి విరాళం

తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించుకున్నాడు ఓ NRI భక్తుడు. నిత్యాన్నదాన పథకానికి కోటి నూటపదహారు రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఎమ్ శ్రీనివాస రెడ్డి అనే దాత టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డికి అందించారు. శ్రీనివాస రెడ్డితో తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు, తర్వాత రంగనాయకుల మండపం దగ్గర ఆయనకు ఆశీర్వచనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో ఎప్పుడూ నిర్వహించే నిత్యాన్నదానానికి తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విరాళాన్ని అందించినట్టు ఆయన తెలిపారు.

Latest Updates