వైట్ హౌస్ ఎదురుగా ప్రవాస భారతీయుల గ్రీన్ కార్డ్ పోరాటం

అమెరికా : వాషింగ్టన్ డీసీ లోని అధ్యక్ష భవనం ముందు గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్స్ లో ఉన్న 1200 మంది ప్రవాస భారతీయులు నిరసన తెలిపారు. H1B వీసా మీద వెళ్లి అక్కడ 10-12 సంవత్సరాలుగా స్థిరపడి ఉన్న వాళ్ళకి… గ్రీన్ కార్డు రావటానికి 100 సంవత్సరాలుపైగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 మార్చ్ లో కూడా అతిపెద్ద నిరసన తెలిపినప్పుడు.. ఇమ్మిగ్రేషన్ అధికారులు బిల్స్ రూపంలో బిల్లులో కొన్ని అంశాలు చేర్చి కాంగ్రెస్ లో పెట్టారు. అప్పుడు ఆ బిల్లు వీగిపోయింది.

అనుమతి లేకుండా అమెరికాలో ప్రవేశించిన ఇమ్మిగ్రెంట్స్ కి.. క్షమాభిక్ష ప్రకటించే చర్చలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఇండియన్ లీగల్ ఇమ్మిగ్రెంట్స్… వైట్ హౌజ్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. లీగల్ గా వచ్చిన వారికంటే ఇల్లీగల్ గా వచ్చిన వారికి న్యాయం జరగటం ఏంటని ప్రశ్నించారు.

వచ్చేవారం జరగబోయే బోర్డర్ సెక్యూరిటీ చర్చల్లో.. పది సంవత్సరాల పైగా వేచి ఉన్న గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్ ఇమ్మిగ్రెంట్స్ కి గ్రీన్ కార్డులు ఇవ్వాలని నిరసన తెలిపారు. రిపబ్లికన్ హిందూ కొహలేషన్ సంస్థ ఆద్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Latest Updates