NRT ఐకానిక్ టవర్ కు శుంకుస్ధాపన చేసిన చంద్రబాబు

BABఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. రాయపూడిలో నిర్మించనున్న .. NRT ఐకానిక్ టవర్ కు శంకుస్థాపన చేశారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ది చేస్తామన్నారు చంద్రబాబు. తర్వాత పవన్ తో కలిసి దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. అయినా… బాబు, పవన్ పలకరించుకోలేదు.
అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలో కృష్ణా నదికి అభిముఖంగా టవర్ నిర్మాణం జరగనుంది. దాదాపు 400 కోట్ల రూపాయల ఖర్చుతో 5 ఎకరాల విస్తీర్ణంలో టవర్ ను AP NRT నిర్మించనుంది. ఇంగ్లీష్ అక్షరం A ఆకారంలో.. 33 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. 18 నెలల్లో నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రవాసాంధ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని… పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు చంద్రబాబు.
తర్వాత గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలున్న 11 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు, పవన్ ఒకే కార్యక్రమంలో పాల్గొని ఎదురుపడ్డా… ఇద్దరు నేతలు పలకరించుకోలేదు.
అంతకు ముందు.. విజయవాడలోని పడమటలో అద్దెకు తీసుకున్న ఇంట్లో కి గృహ ప్రవేశం చేశారు పవన్ కళ్యాణ్. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల తర్వాత ఇంట్లో కి వెళ్లారు. కొత్తగా గుంటూరులో ఇల్లు కట్టుకుంటున్నారు పవన్. దాని నిర్మాణం ఆలస్యం కావడంతో.. విజయవాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates