అమరుల త్యాగం దేశం మర్చిపోదు

nsa-ajit-doval-at-80th-crpf-anniversary-parade-in-gurugram

CRPF 80వ రైజింగ్ డే కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుగ్రామ్ లో CRPF ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పెరేడ్ కు వచ్చారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. దేశ రక్షణలో CRPF కీలక పాత్ర పోషిస్తోందని, సీఆర్పీఎఫ్ డీజీ అన్నారు. అమరుల త్యాగాన్ని దేశం మర్చిపోదన్నారు. దేశ సేవలో ఇప్పటి వరకు 2180 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారన్నారు. దేశంలో వరుస ఉగ్రదాడులను తిప్పికొట్టడం, టెర్రరిస్టులకు చెక్ పెట్టడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

Latest Updates