ప్రధాని మోడీ విజిట్‌ను కోఆర్డినేట్ చేసిన ఎన్‌ఎస్‌ఏ దోవల్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం లేహ్‌కు ఆకస్మిక పర్యటనకు వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విజిట్‌లో భాగంగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దూకుడును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇండియన్ మిలటరీకి కావాల్సిన ఆపరేషనల్ ప్రిపేర్డ్‌నెస్‌ గురించి మోడీ ఆర్మీ అధికారులతో చర్చించారని తెలిసింది. మోడీ లేహ్ పర్యటన గురించి ఆయన ఎయిర్‌‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే క్షణం దాకా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. ఈ విజిట్‌కు సంబంధించిన విషయాలను ఎన్‌ఎస్‌ఏ దోవల్, సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్​ మనోజ్ ముకుంద్ నరవాణేలు దగ్గరుండి చూసుకున్నారని సమాచారం.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణేతో మోడీ పలు విషయాలపై మాట్లాడారని తెలుస్తోంది. తొలుత 14 కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ అయిన నిమూకు చేరుకున్న మోడీ.. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ హరీందర్ సింగ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషితో చర్చించారు. అలాగే మన వైపు నుంచి ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదని.. చైనా తీవ్రతలకు పాల్పడితే మాత్రం దీటుగా ప్రతిఘటించాలని కమాండర్స్‌కు మోడీ ఆదేశించారని సమాచారం. ఇలాంటి మెసేజే 2017లో డోక్లాంలో ఉద్రిక్తతల సమయంలో ఇచ్చారని చెప్పుకుంటారు. ఇండియా తన భూభాగంలో నుంచి ఒక్క ఇంచును కూడా సరెండర్ చేయబోదని లడఖ్ పర్యటన ద్వారా డ్రాగన్‌కు మోడీ హెచ్చరికలు పంపారని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. కాగా, రెండు వారాల పాటు సెల్ఫ్ ఇంపోజ్డ్ ఐసోలేషన్‌లో ఉన్న ఎన్‌ఎస్‌ఏ దోవల్ మోడీ పర్యటన తర్వాత ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

Latest Updates