దీక్ష విరమించిన యువజన కాంగ్రెస్ నేతలు

యువజన కాంగ్రెస్, NSUI నేతలు దీక్ష విరమించారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలకు నిరసనగా గాంధీభవన్ లో అనిల్ కుమార్ యాదవ్, బలమూర్ వెంకట్ లు  రెండు రోజులనుంచి దీక్ష చేపట్టారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం వీరికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ మదుయాష్కి గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇంటర్ విద్యార్థులను బలిగొన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

Latest Updates