NTR చరిత్ర సృష్టించిన యుగపురుషుడు : చంద్రబాబు

babuNTR చరిత్ర సృష్టించిన యుగపురుషుడు అన్నారు AP  సీఎం చంద్రబాబు నాయుడు. రెండో రోజు మహానాడులో పాల్గొన్న బాబు…ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాబుతో పాటు బాలయ్య, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్ జీవితం అదరికీ ఆదర్శంగా నిలుస్తందన్నారు. మరోవైపు తన తండ్రి NTR బయోపిక్ లో నటించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు అన్నారు.

పేదరికం లేని సమాజం చూడాలని ఎన్టీఆర్‌ కలలు కన్నారని తెలిపిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్‌ కు భారతరత్న ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా తెరకెక్కించాలన్నారు. ఎన్టీఆర్‌ కు భారత రత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు చంద్రబాబు. అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్ కు త్వరలోనే శ్రీకారం చుడుతున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.

Posted in Uncategorized

Latest Updates