NTR పేరు చెడగొట్టను: మంత్రి కేటీఆర్

balakrishna-ktrప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి.. క్యాన్సర్ పై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. బసవతారకం ట్రస్ట్ కు ముఖ్యమంత్రి పన్ను మినహాయింపు ఇవ్వటం వల్ల ఎంతో మందికి లాభం కలుగుతోందన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ యూనిట్ ప్రారంభించారు కేటీఆర్. ఏ ఉద్దేశంతో తనకు కేటీఆర్ అని పేరు పెట్టారో తెలియదు కానీ.. తారక రామారావు పేరు చెడగొట్టనన్నారు మంత్రి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. బసవతారకం ఆస్పత్రి పన్ను రద్దు చేయాలని పదేళ్లలో ముగ్గురు సీఎంలను అడిగినా చేయలేదని.. సీఎం కేసీఆర్ పన్ను రద్దు చేశారని మంత్రి తెలియజేశారు. బసవతారకం ఆస్పత్రి బయట షెల్టర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. అవసరమైతే మరిన్ని షెల్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

బసవతారం హాస్పిటల్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో.. క్యాన్సర్ కు చికిత్స అందిస్తున్నామన్నారు సినిమా నటుడు, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ. బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన పన్ను రద్దు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు . మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా BMT యూనిట్ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. 40 బెడ్లతో ప్రారంభమైన ఆస్పత్రి ప్రపంచ స్థాయికి చేరుకున్నదంటే డాక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు బాలకృష్ణ.

Posted in Uncategorized

Latest Updates