NTR బయోపిక్ : బాలకృష్ణ లుక్ రిలీజ్

BALAKRISHNAక్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం (జూలై-5) నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ఎన్టీఆర్‌ గెటప్‌ లో బాలకృష్ణ స్టిల్‌ ను విడుదల చేశాడు.  పోస్టర్‌ లో బాలకృష్ణ లుక్‌ బాగుంది. ఆయన చాలా యంగ్‌ గా కనిపిస్తున్నారు.

ఈ పోస్టర్‌ లో ఓ వైపు బాలయ్య ఫొటో ఉండగా..ఇంకోసైడ్ ఎన్టీఆర్‌ 1975లో డైరీలో రాసుకున్న పేజీ ఉంది. అందులో అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే అని రామారావు సంతకం ఉంది.

ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, నాగచైతన్య, రానా, శర్వానంద్‌ పేర్లు వినిపిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీలోను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని నిర్ణయించింది యూనిట్. బాలకృష్ణ-క్రిష్‌ కాంబినేషన్‌ లో గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates