NTR బయోపిక్ : బాలయ్యకి తల్లిగా విద్యాబాలన్

సినీ నటుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు బయోపిక్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకి బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను ఎంపిక చేశారు. షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. బసవతారకం పాత్రకు అంగీకరించే ముందే.. ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవటంతోపాటు.. పాత వీడియోలు కూడా చూశారంట. బసవతారకం వేషదారణ, మాట తీరు, హావభావాలు, సీఎం సతీమణిగా ఉన్న సమయంలో ఆమె తీరును మొత్తాన్ని బాలయ్య దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారంట. అంతే కాకుండా ఆమె ఫొటోలు అన్నీ పరిశీలించారు. కట్టుబొట్టూ ఎలా ఉండేది చూశారు.

షూటింగ్ లో పాల్గొంటున్న విద్యాబాలన్.. బాలకృష్ణ ఇంటికి వచ్చారు. ఆమెకు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పసుపు, కుంకుమతో సత్కరించింది బాలయ్య భార్య. బాలయ్య ఇంటికి వచ్చిన విద్యాబాలన్ మాట్లాడుతూ.. ఆత్మీయుల ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. బసవతారకం పాత్రలో నటించటం ఓ వరంగా ఫీలవుతున్నట్లు వెల్లడించింది.

Posted in Uncategorized

Latest Updates