NTR మూవీ : చంద్రబాబు పాత్రలో రాణా

క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్. ఈ మూవీలో రానా ఓ క్యారెక్టర్ లో నటించనున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం (ఆగస్టు-3) రానా స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు రానా కూడా చేరడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే బాలకృష్ణ .. విద్యాబాలన్‌ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసిన క్రిష్..  తర్వాత షెడ్యూల్లో  సన్నివేశాలను షూట్ చేసే పనిలో ఉన్నారు.

ఈ షెడ్యూల్‌ లో రానా పాల్గొనే అవకాశం ఉంది.  ఈమూవీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అల్లుడు పాత్రలో రానా కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు రాగా..సినిమాలో నటిస్తున్నట్లు రానా ఇచ్చిన క్లారిటీతో.. క్యారెక్టర్ ఇదే అయి ఉంటుందని తెలుస్తోంది.  ఈ క్రమంలో  కొన్నిరోజులుగా రానా చంద్రబాబు నాయుడి బాడీ లాంగ్వేజ్‌ ను .. డైలాగ్ డెలివరీని ప్రాక్టీస్ చేస్తూ వున్నాడట. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆయన రిహార్సల్స్ పూర్తయ్యాయని సమాచారం.

లేటెస్ట్ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్, చంద్రబాబుకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది.  బాహుబలితో ఆకట్టుకున్న రానా ఎన్టీఆర్ లోనూ అందుకు తగ్గటుట్టుగానే క్యారెక్టర్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీలో నటించే మరికొందరి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు తెలిపింది యూనిట్.

Posted in Uncategorized

Latest Updates