NTR సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కి ఎంపిక

ఎన్టీఆర్ మొదటి సారిగా త్రిపాత్రాభినయంలో నటించిన సినిమా జై లవకుశ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై,లవ, కుశ అనే మూడు విభిన్న కేరెక్టర్లలో నటించాడు. ఈమూవీని పరిపూర్ణమైన యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. ఎన్టీఆర్ కెరీర్‌లో రెండవ అతిపెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి అరుదైన గౌర‌వం ల‌భించింది. నార్త్ కొరియాలో జ‌రిగే బిఐఎఫ్ఎఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌, బుచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను ‘జై లవ కుశ’ సినిమాను ఎంపిక చేశారు. ఉత్త‌మ ఏషియ‌న్ సినిమా విభాగంలో జై ల‌వ‌కుశ చిత్రానికి గౌర‌వం ద‌క్క‌గా… ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా కూడా ‘జై లవ కుశ. బాబీ తెర‌కెక్కించగా.. క‌ళ్యాణ్ రామ్ నిర్మించాడు. నివేదా థామ‌స్‌, రాశీ ఖ‌న్నాలు హీరోయిన్లుగా నటించారు.

Posted in Uncategorized

Latest Updates