మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జనవరి 9న పార్ట్-1 ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన యూనిట్.. లేటెస్ట్ గా పార్ట్-2 ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 22న ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపింది యూనిట్. మహానాయకుడు రిలీజ్ ను మొదట జనవరి 26నే చేయాలని ప్లాన్ చేసిన యూనిట్.. ఆ తర్వాత దానిని ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే షూటింగ్ పూర్తికాని కారణంగా ఈ తేదీని మరోసారి వాయిదా వేసి, ఫైనల్ గా ఫిబ్రవరి -22కి ఫిక్స్ చేశారు.

ఈ ప్రాజెక్టుని డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించారు. ఈ మూవీలో బాలకృష్ణ లీడ్ రోల్‌ లో నటించడమే గాక.. నిర్మాణ పనులను తానే స్వయంగా చేపట్టారు.

Latest Updates