రెండు వారాల తర్వాత కూతురిని చూసి నర్సు కంటతడి

బెళగావి: కరోనా పేషెంట్స్ కు ట్రీట్ మెంట్ చేస్తున్న ఓ నర్సు రెండు వారాల తర్వాత తన మూడేళ్ల కూతురును చూసి భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. తల్లిని చూసిన ఆనందంలో ఆమె దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన కూతురును పాప తండ్రే అడ్డుకోవటం అక్కడున్నవాళ్లను కదిలించేసింది. దూరం నుంచే తల్లి, కూతురు ఒకరినొకరు చూస్తూ ఏడ్చుకుంటు ఉండిపోయారు. ఈ మనసును కదిలించే సంఘటన కర్ణాటకలో బెళగావిలో చోటుచేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్ లో కరోనా పేషెంట్స్ కు ట్రీట్ మెంట్ చేస్తున్న టీమ్ లో సుగంధ హెడ్ నర్స్ గా ఉన్నారు. ఆమె మూడేళ్ల పాప ఐశ్వర్య ఉంది. డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఇంటికి వెళ్లటం లేదు. కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందన్న భయంతో హస్పిటల్ లోని హాస్టల్ లోనే ఉంటున్నారు. తల్లి రెండు వారాలుగా కనిపించకపోయే సరికి సుగంధ కూతురు సరిగా అన్నం తినటం లేదు. వేరే మార్గం లేక ఆ పాప తండ్రి బుధవారం తల్లి ఉంటున్న హాస్టల్ వద్దకు తనను తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా దూరం నుంచే తల్లి, కూతుళ్లు మాట్లాడుకున్నారు.

Latest Updates