నర్సుకు కరోనా.. హాస్పిటల్ సీల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ హాస్పిటల్ మొత్తాన్ని సీల్ చేసేశారు. నార్త్ ఢిల్లీలోని హిందూ రావ్ అనే ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుకు కరోనా సోకింది. దీంతో మొత్తం ఆస్పత్రిని సీల్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యం నిర్ణయించింది. నర్స్ తో కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించిన తర్వాత ఆస్పత్రిని శానిటైజ్ చేశాకే తిరిగి సేవలు ప్రారంభిస్తామని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వర్షా జోషి తెలిపారు. గత రెండు వారాలుగా ఆ నర్స్ ఆస్పత్రిలోని చాలా క్యాంపస్ ల్లో విధులు నిర్వహించిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని మండిపడ్డారు. దీనిపై పూర్తి విచారణ చేస్తామన్నారు.

Latest Updates