300 మంది రోగులను చంపిన నర్సు

Nurse ‘killed 300 patients’

అది జర్మనీలోని డెల్మోన్ హార్స్ట్ లోని ఓ హాస్పిటల్. రెఫరెన్స్ లెటర్ పట్టుకుని వచ్చాడో కొత్త నర్సు. అతడిని జాయిన్ చేసుకున్నారు. ఓ నాలుగు నెలల తర్వాత.. అతడి ‘సంరక్షణ’లో ఉన్న మహిళ చనిపోయింది. తర్వాత మరో ముగ్గురు వరుసగా మృతి చెందారు. దీనికన్నా ముందు ఓల్డెన్ బర్గ్​లోని ఓ ఆస్పత్రిలోనూ పేషెంట్లు వరుసగా చనిపోయారు. మొత్తంగా 100 మందిని చంపానని అతడు ఒప్పుకున్నాడు. కానీ,  300 మందికిపైగానే అతడు చంపేశాడని అధికారులు అంటున్నారు.  42 ఏళ్ల నీల్స్ హోగెల్​.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఎక్కువ మందిని చంపిన సీరియల్ కిల్లర్. 2000 సంవత్సరం నుంచి తర్వాతి ఐదేళ్లలో ఏకంగా 300 మందిని చంపాడని  చెబుతున్నారు. ఇతడిపై నమోదైన కేసులను దర్యాప్తు చేసేందుకు అధికారులు జర్మనీ, పోలాండ్, టర్కీల్లోని సమాధులను తవ్వి 130 మృతదేహాలను పరిశీలించారు. అయితే అతడు ఎందుకు చంపాడనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతానికైతే ఇద్దరు పేషెంట్లను చంపిన కేసు, నలుగురిని చంపడంలో భాగమైన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.

Latest Updates