కరోనా సోకి 8మంది మృతి.. ఆత్మహత్య చేసుకున్న నర్స్

కరోనా వైరస్ తో 8మంది మృతి చెందడంతో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకుంది.

సౌత్ లండన్ లో కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలోని ఐసీయూలో ఓ యువతి (20) నర్స్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే  కరోనా వైరస్ సోకడంతో 8మంది బాధితులు ఆ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వారికి ఆ యువతి ట్రీట్ మెంట్ చేసేది. ఈ నేపథ్యంలో ఆ ఎనిమిది మంది కరోనా వైరస్ తో మరణించారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఓవర్ డోస్ ట్యాబెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. నర్స్ ఆత్మహత్య చేసుకుందనే సమాచారంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆమె డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఆస్పత్రిలో ఆపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పిలిచే ప్రయత్నం చేయడంతో ఆమె రెస్పాండ్ కాలేదని, దీంతో తోటి నర్స్ లు తమకు సమాచారం అందించారని అన్నారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ తో ఐసీయూలో ఉన్న 8మంది బాధితులు మరణించారని, వారికి ఆ నర్సే ట్రీట్మెంట్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.  వారి మరణంపై మనస్థాపానికి గురైన నర్స్ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. నర్స్ మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More News

దూరమే మేలు… ఇంట్లో ఉండడమే మందు

Latest Updates