పోలీసుల కస్టడీకి నూతన్ నాయుడు

సినీ నిర్మాత ,బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని విశాఖలోని కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో పలువురికి ఫోన్ చేసి, మోసం చేసిన కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండులో వున్నారు.

నూతన్ నాయుడుని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో శని, ఆది, సోమవారాల్లో విచారించడానికి పోలీసులకు జడ్జి అనుమతించారు. మరోవైపు దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడి భార్య మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Updates