న్యాయ్ స్కీం: నిరుపేదలకు రాహుల్ ఆఫర్

సార్వత్రిక ఎన్నికల్లో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కొత్త కొత్త పథకాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. అటు రుణ మాఫీ…ఇటు న్యాయ్…రెండు మెగా స్కీంలతో ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు… మోడీ పీఎం కిసాన్ కు కౌంటర్ గా పేదలకు కనీస ఆదాయ పథకానికి హామీ ఇచ్చారు.

దేశంలో 20శాతం మంది పేదలకు కనీస ఆదాయం కల్పించే పథకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న ప్రవేశ పెట్టారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటం ద్వారా… పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధించే అవకాశం ఉందన్నారు. అయితే పేదలు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పథకం ద్వారా కాంగ్రెస్ కు మంచి ఊపు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్ లో రైతులకు ఏటా 6 వేలు డెరెక్ట్ గా చెల్లించే పథకాన్నికేంద్రం ప్రకటించింది. దానికి ప్రతిగా రాహుల్  ఈ కనీస ఆదాయ పథకానికి హామీ ఇచ్చారు. మోడీ గత ఎన్నికలకు ముందు ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని వాగ్దానం చేశారు. కానీ అది అమలుకాలేదు. దీంతో రాహుల్ రుణమాఫీతో పాటు… న్యాయ్…పథకంతో సామాన్యుడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు రాహాల్.

దేశంలో నిరుపేదలెందరన్న పక్కా లెక్క లేనేలేదని నీతి ఆయోగ్  స్పష్టం చేసింది. 2016 – 17 ఆర్థిక సర్వేలో తొలిసారిగా సార్వత్రిక కనీస ఆదాయ పథకం యూబీఐని ప్రతిపాదించారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి నెలకు 1500 చొప్పున ఏడాదికి 18000 కనీస ఆదాయంగా ఇవ్వాలని ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్  సుబ్రమణియన్  సూచించారు. అయితే దీన్ని మోడీ సర్కారు పట్టించుకోలేదు. రాహుల్  పథకం ప్రతిపేద కుటుంబానికీ అంతకు నాలుగు రెట్లు అంటే కనీసం 6000 చెల్లిస్తామంటున్నారు.

భారత్  లాంటి పెద్ద దేశాల్లో ఈ తరహా పథకాలు ఆశించినంత ప్రయోజనాన్ని ఇవ్వవంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని….డబ్బు అకౌంట్లలో జమచెయ్యడం సరైంది కాదంటున్నారు.

Latest Updates