వలసొచ్చినోళ్లను తిడితే.. రూ.1.77 కోట్ల ఫైన్!

న్యూయార్క్‌‌‌‌ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆదేశాలు

‘‘ఏయ్.. నీవు ఇల్లీగల్ ఏలియన్ వి. మా దేశానికి అక్రమంగా వలసొచ్చిన నల్లోడివి..” అంటూ న్యూయార్క్ నగరంలో విదేశీయులను ఎవరైనా అవమానిస్తూ మాట్లాడారంటే.. ఇక వారి పని అయిపోయినట్లే. విదేశీయుల పట్ల భాష, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపితే ఏకంగా 2.50 లక్షల డాలర్ల ఫైన్ (మన కరెన్సీలో అయితే కోటి 77 లక్షల 6 వేల375 రూపాయలు) కక్కాల్సిందే. ఇందుకు సంబంధించి ఇటీవల న్యూయార్క్ సిటీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వలసదారుల పట్ల ఎలాంటి వేధింపులు, వివక్ష చూపరాదని హెచ్చరిస్తూ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. వేరే భాష మాట్లాడుతున్నారని బెదిరించినా ఫైన్ పడుతుందని చెప్పింది.

‘వలసదారులకు బిగ్ యాపిల్ (న్యూయార్క్ ను ఇలా కూడా పిలుస్తారు) అల్టిమేట్ సిటీ. ఇక్కడ జాతి విద్వేషాన్ని వ్యాప్తి చేయాలనుకుంటే తర్వాత ఎదురయ్యే పర్యవసనాలను ఎవరైనా సరే ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించింది. ఇదే విషయాన్ని న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో కూడా ట్వీట్ చేశారు. న్యూయార్క్ నగరానికి వచ్చిన విదేశీయులు, వలసొచ్చినవారి పట్ల ఇక్కడి ఇండ్ల ఓనర్లు, లోకల్ జనాలు ఎలాంటి వివక్ష చూపరాదన్న ఉద్దేశంతో ఈ గైడ్ లైన్స్ జారీ చేసినట్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ వెల్లడించింది.

Latest Updates