ఆర్మూర్ లో 9న నిజామాబాద్ రైతుల ఐక్య సభ

జగిత్యాల జిల్లా : నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ కు భారీసంఖ్యలో అభ్యర్థులు పోటీ పడటంతో… అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఎన్నికల కమిషన్. లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు.

జగిత్యాల లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శరత్ దీనికి హాజరయ్యారు. ఎం-3 ఈవీఎం వినియోగిస్తున్నట్టు చెప్పారు. వీవీ ప్యాట్ల పనితీరుపై సిబ్బందికి అవగాహన కల్పించారు అధికారులు.

అదే విధంగా… జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఓటింగ్ మోడల్ కేంద్రాన్ని పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థులు.

నిజామాబాద్ లోక్ సభ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 179 మంది పసుపు రైతులే అని చెబుతున్నారు. ఇన్ని పేర్లు డిస్ ప్లేలో పెట్టాలి కాబట్టి… ఒకటికి మించిన ఈవీఎంలను వరుసగా పెట్టి.. ప్రత్యేకంగా పోలింగ్ ను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.

ఈవీఎంతో కాకుండా.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని పోటీలో ఉన్న రైతు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఎల్లుండి అంటే ఈనెల 9న రైతు ఐక్య సభ నిర్వహిస్తామని.. భారీగా ప్రజలు, రైతులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Latest Updates