ట్రెండింగ్.. సైరా వీడియో సాంగ్ అదుర్స్

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా సైరాపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ దేశభక్తి ప్రధానమైన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా.. సైరా సినిమా టైటిల్ సాంగ్  వీడియోను విడుదల చేశారు. నరసింహారెడ్డి గొప్పతనాన్ని తమన్నా, నయనతార కీర్తిస్తున్న సందర్భంలో ఈ పాట వస్తుంది. భారీస్థాయిలో పాటను చిత్రీకరించారు. కొరియోగ్రఫీ కూడా కళ్లుచెదిరేలా ఉంది. సాంగ్ సోషల్ మీడియా రికార్డులు బద్దలు కొడుతూ.. టాప్ లో ట్రెండింగ్ అవుతోంది.

‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌరా

ఉయ్యాల వాడ నారసింహుడా..

చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా..

రేనాటి సీమ కన్న సూర్యుడా..

నింగి శిరసు వంచి.. నమోస్తు నీకు అనగా.. నవోదయానివై జనించినావురా.. ఓ సైరా… ఓ సైరా…’

అంటూ సాగే ఈ పాట వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ ఖాయం. ‘దాస్యాన జీవించి ఉండటం కన్నా చావెంత మేలంది నీ పౌరుషం’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి. అమిత్ త్రివేది కంపోజిషన్ లో … సునీధీ చౌహాన్, శ్రేయాఘోషల్ ఈ పాటను పాడారు. పాటలో చూపించిన సన్నివేశాలు… అత్యున్నతంగా ఉన్న మూవీ స్టాండర్డ్స్ ను చెబుతున్నాయి. రామ్ చరణ్ నిర్మాణంలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

Latest Updates