లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..12 మందికి గాయాలు

వైజాగ్ : ఆగి ఉన్న లారీని పలాస నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.  ఈ  12 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కశింకోట మండలం ఎన్‌.జి.పాలెంలో బుధవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని గాయపడ్డవారిని అనకాపల్లి ఎన్టీఆర్‌ హస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సును పలాస డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

 

Latest Updates