ఒబామాను మెప్పించిన ఇండియన్ సింగర్

ప్రతీ సంవత్సరం తనకు నచ్చిన సంగీతం, పుస్తకాలు, మరియు చలనచిత్రాల లిస్టును విడుదల చేయడం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అలవాటు. అందులో భాగంగా సోమవారం 2019లో తనకు నచ్చిన పాటల జాబితాను ఒబామా విడుదల చేశారు. ఆ జాబితాలో ఇండియన్ సింగర్ రాసి, పాడిన పాట చోటు సంపాదించుకోవడం విశేషం. సింగర్ ప్రతీక్ కుహాద్ రాసిన ‘కోల్డ్ మెస్’ అనే పాట ఒబామాను ఆకట్టుకుంది. ఒబామా విడుదల చేసిన జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు ప్రతీక్ కుహాద్. తాను రాసిన పాటను మెచ్చి, దాన్ని ఒబామా ట్విట్టర్‌లో పంచుకోవడం చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉందని ప్రతీక్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

For More News..

హైదరాబాద్ ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Latest Updates