ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలుగా అబార్షన్లు

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ యువతికి  అబార్షన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే షాద్ నగర్ పట్టణంలో ఉన్న సాయి మైత్రి పాలి క్లినిక్ నడుపుతున్న  డా.శ్రీనివాస్ రెడ్డి ఓ యువతికి అబార్షన్ చేస్తున్నాడని జిల్లా వైద్యాధికారి చందు నాయక్ కు తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి బయలు దేరారు . విషయం తెలుసుకున్న డా . శ్రీనివాస్ రెడ్డి పరారయ్యారు.  అనంతరం జిల్లా వైద్యాధికారి ఆసుపత్రికి చేరుకొని  విచారించారు.  ఎలా అబార్షన్ చేస్తారంటూ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి  నడుస్తోందన్నారు. ఆసుపత్రికి  అనుమతి, రిజిస్టేషన్​ లేదని డా . శ్రీనివాస్ సర్టిఫికెట్ చైనా కు సంబంధించిందన్నారు. ఆసుపత్రి పై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

 

Latest Updates