హైద‌రాబాద్ మునగడానికి ఆక్రమణలే కారణం: కిషన్ రెడ్డి

హైద‌రాబాద్ లో చెరువులు, నాలాలు, న‌దులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కావ‌డం కారణంగానే వ‌ర‌ద ముంపు అధికంగా జ‌రిగింద‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. 2014కు ముందు, తర్వాత మూసి నది శాటిలైట్ ఫొటోలను చూస్తే ఆక్రమణలు ఎలా జరిగాయో తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆక్రమణలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువలు, డ్రైనేజీ సిస్టం దారుణంగా ఉన్నాయని… కనీసం వరద కాలువల్లో పూడిక తీయడం లేదని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర బృందం పర్యటన తర్వాత నష్టాన్ని అంచనా వేసి దాని ప్రాతిపదికగా సహాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తుల నిధి నుంచి తాత్కాలికంగా నిధులు ఖర్చు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని రీయంబర్స్‌మెంట్‌ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారమే, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుందని తెలిపారు కిషన్ రెడ్డి.

Latest Updates