తాత పెద్ద మనసు.. రైతులకు సాయం

  • గింజలను ఉచితంగా పిండిపట్టిస్తున్న 81 ఏళ్ల ముసలాయన

జమ్మూకాశ్మీర్‌‌: కరోనా కష్టకాలంలో మంచి మనసుతో చాలా మంది దాతలు పేదలకు హెల్ప్‌ చేసేందుకు ముందుకు వస్తున్నరు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి రోజు తిండి అందిస్తూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌‌కు చెందిన ఈ తాత కూడా తనకు ఉన్నంతలో గ్రామంలోని రైతులకు, ఊరి జనానికి సాయం చేసి ఆదుకుంటున్నడు. జమ్మూకాశ్మీర్‌‌ రైసీ జిల్లాకు చెందిన 81 ఏళ్ల శంకర్‌‌సింగ్‌ మిల్లు నడుపుతున్నాడు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించి ఊరిలో ఎవరికి పనులు లేకోపోవడంతో ఆయనకు ఉన్నంతలో సాయం చేయాలని అనుకన్నాడు. ఊరిలో జనాలందరికీ, రైతులకు గింజలను ఫ్రీగా పిండి చేసిస్తున్నాడు. “ కరోనా వైరస్‌ అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా మంది పేదలకు సాయం చేస్తున్నారు. వారిని చూసి స్ఫూర్తి పొందాను. నా దగ్గర ఇచ్చేందుకు డబ్బు లేదు. అందుకే నాకు ఉన్నంతలో గింజలను ఫ్రీగా పిండి చేసి ఇస్తున్నాను. ఈ హెల్త్‌ క్రైసిస్‌ పూర్తయ్యే వరకు ఇది కొనసాగిస్తాను” అని శంకర్‌‌ సింగ్‌ అన్నారు. శంకర్‌‌ చేస్తున్న ఈ సాయాన్ని జిల్లా అధికారులు మెచ్చుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆయనకు సాయం అందేలా చూస్తామని ఫుడ్‌ అండ్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌ మహ్మద్‌ సయ్యద్‌ చెప్పారు.

Latest Updates