ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం

ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం అమలు చేయనుంది అక్కడి ప్రభుత్వం. నవంబర్ 4 నుంచి 15వరకు సరి-బేసి విధానం అమలు చేస్తామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నాన్-ట్రాన్స్ పోర్ట్ ఫోర్ వీలర్స్ కు మాత్రమే ఆడ్-ఈవెన్ ఫార్ములా వర్తిస్తుందన్నారు. టూవీలర్స్ ను మినహాయించారు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు సరి-బేసి అమలు చేస్తారు. రూల్స్ ఉల్లంఘిస్తే 4వేల రూపాయలు ఫైన్ వేస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్రమంత్రులు, గవర్నర్ ల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలకు మినహాయింపు ఉండదని కేజ్రీ చెప్పారు. కాలుష్య నియంత్రణకు 16 విజిలెన్స్ టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు కేజ్రీవాల్.

Odd-even in Delhi: Arvind Kejriwal announces rules, dates and fine

Latest Updates