పైచేయి నవీన్ దా..? నరేంద్రదా..?

నవీన్ పట్నాయక్… పరిచయం అక్కరలేని పేరు. రెండు దశాబ్దా లుగా బిజూజనతాదళ్‌‌ ను ఒడిషా అధికార పీఠంపై కూర్చోబెట్టిన నాయకుడు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ జెండా ఎగరేసేందుకు రెడీ అవుతున్నారు. ఒడిషా లో నవీన్ పట్నాయక్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే. నడిపించే నాయకుడంటూ లేకపోవడంతో కాంగ్రెస్ బాగా దెబ్బతింది. దీంతో బిజూ జనతాదళ్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఒడిషాలో లోక్ సభ ఎన్నికలు నవీన్ పట్నాయక్ వర్సెస్ నరేంద్ర మోడీగా మారాయి. పేరుకు ట్రయాంగిల్ ఫైట్ అయినా కాంగ్రెస్ పోటీ నామమాత్రంగానే ఉంది. దీంతో బీజేడీ, బీజేపీ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకొంది. ఒడిషాలో మొత్తం 21 లోక్ సభ సెగ్మెంట్లున్నాయి. 2014 ఎన్నికల్లో దేశమంతా మోడీ గాలి వీచినా ఒడిషాలో ఆ ప్రభావం ఏమీ కనిపించలేదు. 20 నియోజకవర్గా లను నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) కైవశం చేసుకోగా బీజేపీ కేవలం ఒకే ఒక్క సెగ్మెంట్ తో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. సామాన్య ప్రజల్లో తనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో పార్టీకి 20 సీట్లను సాధించి పెట్టారు నవీన్ పట్నాయక్. మొదట్లో బీజేపీతో కలిసి అడుగులేసినా తర్వా త ఆ స్నేహానికి నవీన్ కటీఫ్ చెప్పారు. 2007 చివర్లో కంధమల్‌‌జిల్లాలో బజరంగ్‌ దళ్‌‌కా ర్యకలాపాలు, స్వా మి లక్ష్మణానంద సరస్వతి హత్య కారణంగా జరిగిన సంఘటనల నేపథ్యం లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు నవీన్ పట్నాయక్. ఎన్డీయే కూటమికి దూరమైనా, యూపీఏతో చేతులు కలపలేదు. అయితే దాదాపు ఏడాది కిందట నవీన్ పట్నాయక్ ఎన్డీయే కూటమిలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తు న్నట్లు నవీన్ పట్నాయక్ తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఈసారి ఎలాగైనా ఒడిషాలో మెజారిటీ లోక్ సభ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా వీలున్నప్పుడల్లా ఒడిషాలో పర్యటించారు.పార్టీని బలోపేతం చేయడానికి లోకల్ లీడర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఫిరాయింపులపైనే బీజేపీ ఆశలు

గత ఏడాదిగా రకరకాల కారణాలతో బిజూ జనతాదళ్ లో అసంతృప్తి పెరిగింది. దీంతో పార్టీ నుంచి ఫిరాయింపులు జోరందుకున్నాయి. జై పాండా, బలభద్ర మాఝీ, మాజీ మంత్రి దామోదర్ రౌత్ వంటి సీనియర్ లీడర్లం తా బిజూ జనతాదళ్ కు గుడ్ బై కొట్టి బీజేపీలో చేరారు. టికెట్ లు రాకపోతే కాషాయ పార్టీలో చేరడానికి మరికొంత మంది

సిట్టింగ్ ఎంపీలు రెడీ అయ్యా రు. పోలింగ్ నాటికి ఈ ఫిరాయింపులు ఇంకా పెరుగుతాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోం ది. రెం డు దశాబ్దా లుగా ఒడిషాలో బిజూ జనతాదళ్ అధికా రంలో ఉంది. దీంతో నవీన్ పట్నాయక్ పై వ్యక్తిగతంగా గుడ్ విల్ ఉన్నప్పటికీ ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకత తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని కాషాయ పార్టీ ఆశలు పెట్టు కుంది. ప్రజలు తప్పకుండా మార్పు కోరతారని ఒక నిర్ణయాని కి వచ్చింది.

నవీన్ పట్నాయక్ కు ప్రత్యామ్నా యం తామేనంటూ ప్రజల దగ్గరకు వెళుతోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఒడిషా ఇన్ చార్జ్ అరుణ్ సింగ్.

పశ్చిమ ఒడిషా పై బీజేపీ ప్రత్యేక దృష్టి

పశ్చిమ ఒడిషా రాజకీయంగా చాలా కీలకమైంది. ఐదు లోక్ సభ సెగ్మెంట్లు , 35 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ ప్రాంతంలో ఉన్నా యి. ఇక్కడ మొదటి నుంచి బిజూ జనతాదళ్ కు పలుకుబడి ఎక్కువ. అయితే 2017 లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిం ది. 209 జిల్లా పరిషత్ సీట్లలో 126 సీట్లను కాషాయ పార్టీ గెలుచుకుంది.దీంతో ఈసారి మొత్తం ఐదు లోక్ సభ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. దీని కోసం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది.

లీడర్ లేని ఒడిషా కాంగ్రెస్

ఒడిషా కాంగ్రెస్ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.రాష్ట్రంలో పార్టీకి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నాయకుడంటూ ఎవరూ లేరు. కాంగ్రెస్ కు ఇదో పెద్ద మైనస్ పాయింట్. ఒడిషాలో కాంగ్రెస్ అధికారానికి దూరమై రెండు దశాబ్దా లు కావస్తోంది. కిందటేడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాలు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ చీఫ్ రాహుల్ కూడా ఒడిషా పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా రు.

33 శాతం టికెట్లు మహిళలకే

లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు ఈసారి మహిళా శక్తిపైనే బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ ఎక్కువ ఆశలు పెట్టు కున్నా రు. 33 శాతం టికెట్ల ను మహిళలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించి వారి ఓట్లకు గేలం వేస్తున్నారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. సాధ్యమైనంత వరకు సిట్టింగ్ లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇవ్వా లని నిర్ణయించుకున్నారు. ఆస్కా నియోజకవర్గం నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ( ఎస్ హెచ్ జీఎస్ ) ఉద్యమకారిణి ప్రమీల బిసోయ్ ను బరిలోకి దింపాలని పట్నాయక్ ఓ నిర్ణయాని కి వచ్చారు.

‘నా రాష్ట్రం…నా పార్టీ’ ఇదే నవీన్ పట్నాయక్ నినాదం. ఈ కాన్ సెప్ట్ తోనే 20 ఏళ్లుగా పవర్ గేమ్ ఆడారు. విజేతగా నిలిచారు. ఈసారి కూడా ఆ ఆటే ఆడనున్నా రు నవీన్. కాకపోతే గతంలో కంటే కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితులు. కుర్చీలాటలో బీజేపీ కాచుక్కూచుం ది. ఏమాత్రం అవకాశం దొరికినా, కర్చీఫ్ వేయాలని చూస్తోంది. దానికితగ్గట్టే ప్రణాళికలతోనే ముందుకువెళ్తోంది. బీజేపీ వ్యూహాలకు దీటు గా ఎత్తు గడలు వేస్తూ మరోసారి జనం ముందుకు వెళుతున్నా రు.

సంక్షేమ పథకాలనే నమ్ముకున్న బిజూ జనతాదళ్

నవీన్ పట్నాయక్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అంటున్నా రు బీజూ జనతాదళ్‌‌ లీడర్లు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు ప్రతి దశలోనూ ప్రభుత్వ సాయం అందేలా రూపొందిం చారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తల్లు లు కాబోయే వారికి మమతయోజన, అంత్యక్రియలకు సాయం అందించే మహాపారాయణ పథకం తీసుకు వచ్చారు. స్కూల్ కెళ్లే చిన్నారులకు ఉచితంగా యూనిఫాం, విద్యార్థు లకు సైకిళ్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, ఆడ పిల్లలకు సానిటరీ నాప్ కిన్స్, దోమతెరలు, వితంతు, -వృద్ధా ప్య పెన్షన్ల వంటి పథకాల్ ని అమలు చేస్తున్నా రు. బిజూ క్రుశక్ కళ్యాణ్ యోజన పై నవీన్ పట్నాయక్ బాగా నమ్మకం పెట్టు కున్నా రు.ఈస్కీంలో రైతులకు ఒక్క శాతం వడ్డీతో రుణాలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Latest Updates