కరోనాను తరిమికొట్టేందుకు నరబలిచ్చిన అర్చకుడు

కరోనాను వైరస్ ను అరికట్టేందుకు పలు దేశాల సైంటిస్టులు వ్యాక్సిన్  కనుగొనేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు కొందరు మూఢనమ్మకాలతో ప్రజలను  భయపెడుతున్నారు. కరోనా వ్యాప్తితో జనం వణికిపోతుంటే..మరోవైపు ఓ పూజారి నరబలితో మరింత భయాందోళనకు గురి చేశాడు. ఈ దారుణమైన ఘటన ఒడిశాలోని కటక్ లో జరిగింది.

ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా పోవాలని కోరుతూ ఓ అలయ అర్చకుడు నరబలి ఇచ్చాడు. బ్రాహ్మణిదేవి ఆలయంలో సంసారీ ఓజా అర్చకుడు. కరోనాను అరికట్టాలని అనుకున్నాడు. దీనికి నరబలి ఇవ్వాలని అనుకున్నాడు. ఆ ఆలయంలోని అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడిని నరికాడు. విషయం తెలుకున్న పోలీసులు అర్చకుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలనే నరబలికి పాల్పడ్డట్లు అర్చకుడు తెలిపాడు. నరబలి విషయం బయటకు తెలియగానే జనం తీవ్ర భయానికి లోనయ్యారు.

Latest Updates