వామ్మో.. పాఠశాలకు రూ.6 కోట్ల కరెంట్ బిల్లు!

ఓ స్కూల్ కు రూ.6 కోట్ల కరెంట్ బిల్ రావడంతో అధికారులు ఖంగుతిన్నారు.  ఒడిశాలోని కటక్ జిల్లా కాంటపాడ ప్రాంతంలోని సమితి శిశువా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేరిట రూ. 6 కోట్ల బిల్ వచ్చింది. 1989 లో స్థాపించబడిన పాఠశాలలో 1 నుండి 8 తరగతులు ఉన్నాయి. 2016 లో  స్కూల్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి బిల్లు రాలేదు.. 2020 ఫిబ్రవరిలో విద్యుత్ శాఖ రూ. 5,92,72,784 రూపాయల బిల్లు వచ్చింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కబితా రాణి సాహూ మాట్లాడుతూ .. “మా పాఠశాలకు 2016 లో విద్యుత్ కనెక్షన్ వచ్చింది. మీటర్ రీడింగ్ ప్రకారం ఇప్పటి వరకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగించబడింది. అయితే, ఫిబ్రవరి 12, 2020 న మాకు రూ.5,92,72,784 బిల్లు వచ్చింది. ఈ విషయంపై  అధికారులకు  ఫిర్యాదు చేశాం. సరి చేసి కొత్త బిల్లు పంపిస్తామన్నారు. కానీ ఏడాది గడిచినా ఇంత వరకు కొత్త బిల్లు పంపించలేదు. పైగా మళ్లీ రూ. 6 కోట్లకు పైగా బిల్లు చెల్లించాలంటూ 20న బిల్లు వచ్చిందని‘ ఆమె అన్నారు.

see more news

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

వెయ్యి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

మన టెలికం బిజినెస్ లోకి ఎలన్ మస్క్

Latest Updates