తలపై కాలుపెట్టి ఆశీర్వదించిన పూజారి…

ఒడిషా: దసరా సందర్భంగా గుడికి వచ్చిన భక్తుల తలలపై కాలు పెట్టి ఆశీర్వదించాడు ఓ ఆలయ పూజారి. ఈ ఘటన ఒడిషా లోని కోర్దా జిల్లా బాన్ పూర్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇది మూడనమ్మకం అని… భక్తుల తలలపై కాలుపెట్టి ఆశీర్వదించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై పూజారి మాట్లాడుతూ.. ఇది తరతరాలుగా వచ్చిన సాంప్రదాయం.. కావాలని ఏం చేయడం లేదని చెప్పారు. కొందరు కావాలనే విమర్షిస్తున్నారని అన్నారు. ఆశీర్వదించిన భక్తులలో కొందరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి చర్యలవల్లే దేశానికి చెడ్డపేరు వస్తుందని నెటిజన్లు కామెంట్ చేశారు.

Latest Updates