కరోనా వ్యక్తులు ఉంటే ఇంట్లో లేదా ఆస్పత్రిలో.. ఉండకపోతే జైలుకే

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులు ఎవరైనా క్వారెంటైన్​లో ఉండేందుకు, ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేందుకు నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద విచారించనుంది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. ఇందుకోసం ‘‘ఒడిశా కొవిడ్–19 రెగ్యులేషన్స్ 2020” పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. గత 14 రోజుల్లో రాష్ట్రం నుంచి ఎవరైనా కరోనా ఎఫెక్టెడ్ దేశాలకు వెళ్లి వస్తే వారు స్వచ్ఛందంగా స్టేట్ కంట్రోల్ రూమ్​లో రిపోర్టు చేయాలని సూచించింది. అక్కడ ఆఫీసర్లు అందజేసే సలహాలు, సూచనలు పాటించాలని చెప్పింది.

Latest Updates